Endless Journey
ఎదురుచూపులకు అందని జాడ కోసం,
ఏమరపాటు తో, తడబడే అడుగుల తో నడిచి వెళ్తుంటే
కనుచూపుమేర కనపడే దారి దీనమైతే
విశ్రమించని ఆలోచనా ప్రవాహం లో ప్రతి అక్షరం వెతికే గమ్యం ఒకటే
దాసోహమని దరి చేరిన, అక్కున చేర్చుకోని కాలం
విశాలమైన విశ్వం లో, ఇరుకైన జీవితం
స్థానమేది సమయంతో సరితూగని మనసు సరళికి
వదలలేని దారికి విలువలేని వ్యధకి
అంతులేని ఆలోచనలకి, అంతం లేని భావోద్వేగానికి, అంతమేది?