Known Unknown

1 min readpoemepistemology

తెలిసినది ఎంతో, తెలియనిది ఇంకెంతో!

తెలియనితనంలో అంతా నాకే తెలుసని భావన ఉంది ఎందరికో!

తెలిసినా, ఇంకా తెలుసుకోవాలనే తపన ఉంది ఎందరికీ?

తెలిసినది ఏంతైనా, ఈ అనంత విశ్వం ముందు మనం నిమిత్త మాత్రులమైనప్పుడు,

ఎంత తెలిసినా, మనకి తెలిసినది తెలుసుకోవాల్సిన దాని ముందు, శూన్యమనిపించదా!?