Unexpected Beauty

1 min readpoemmetaphysics

అనుకోని అందం, అలా నా ముందు నిలిచిన అద్భుతం,

ఆశించని చిలిపితనం, ఆలోచనల్లో నిండిన ఆశ్చర్యం,

అణువంత అభిమతానికి, ఆకాశమంత పరితాపం,

అమాయకత్వపు మోమలో వెల్లువిరిసే భావాల సమాహారం,

మాటలకందని, మనసు పలికే కవితా ప్రవాహం.