Questioning Philosophy

1 min readpoemepistemology

పరిచయం లేని ప్రేమికి, ప్రశ్నలు అవరోధమా?

పరితపించే మనసుకి ఒక మాట దూరమా?

ప్రయత్నమాపని మనిషికి గమ్యం దూరమా?

కనిపించని కనులకు కనపడనిది ఏముంది?

కని పెంచిన తల్లికి తెలియని తపన ఏది?

స్వార్థమెరుగని స్నేహానికి ఈ లోకంలో జాడ ఏది?

ప్రశ్నించే ప్రశ్నకు బదులు చెప్పే బదులు ఏది?

కష్టించే మనిషి చేరుకోలేని లక్ష్యం ఉందా?

కాలంతో చెరగని బాధ ఉందా?

కష్టం తోడవని కలలు, పగటి కలలే కదా!

ప్రశ్నించే తత్వమే కదా జీవిత గమనానికి పునాది, లేదంటే నడిచే దారిలో ఎదురయ్యే ప్రశ్నలకు నీ నుంచి సమాధానమేది?