Worthy Unworthy
1 min readpoemethics
అర్హత లేని వారికోసం అహర్నిశలు శ్రమించే ఓ మహా మనిషి, ఒక్క క్షణమైనా విశ్రమించు
బంధాలనే ముసుగులో రక్తాన్ని పీల్చి
నొప్పి తెలియకుండా మైమరపించి,
నీ కష్టాన్ని విలాసాలకి వాడి
నీకు చివరకు వ్యథని మిగిల్చే
మనుషుల ఊబిలో కూరుకుపోయిన
ఓ మహా మనిషి నీ కష్టానికి అంతమెక్కడ?
నువ్వు పడే తపనకి చేయూత ఎక్కడ?
బాధ్యతల బరువులో మనసు చిక్కి శల్యమై
నీకు మనో వ్యధ మిగిలితే, ఈ బంధాలు నేనున్నానని భరోసా ఇస్తాయా?
అర్హత లేని వారికోసం అహర్నిశలు శ్రమించే ఓ మహా మనిషి, ఒక్క క్షణమైనా విశ్రమించు