India Reflection
వజ్రాలని రాసులుగా పోసిన రాజ్యాలు మనవి
వేదాలలో ఉపనిషత్తులలో, వేల ఏళ్ల ముందే, జ్ఞానాన్ని నింపిన మహర్షులు పుట్టిన నేల మనది
అలాంటి నేలలో, వందల సంవత్సరాల బానిసత్వం, సస్యశ్యామలమైన సమాజంలో కారు చిచ్చు రగిల్చిన వైనం
ఎన్నో ప్రాణాల త్యాగం, మరెందరో మహనీయుల తూటాలకి ఎదురొడ్డి ముందుకెళ్లి మన చేతికి అందించిన స్వతంత్ర భారతం మన ఈ దేశం
ఈ నాడు, వందేమాతరానికి జనగణమనకి మాత్రమే గుర్తుకొచ్చే దేశం
వందలకోట్ల మందికి వంద కూడా చేతిలో లేని దౌర్భాగ్యం
ఒక పూట కూడుకి రెండు పూటల వొళ్లు గుల్ల చేసుకోవాల్సిన దయనీయ జీవనం
ఇదెక్కడి భారతం, మన వీరులకి మనమిచ్చే ఇదెక్కడి కృతజ్ఞతాభావం? ఇదేమి భారతం?
వజ్రాలు పోయి…సంపదలో అడుగుకి చేరి,
శాస్త్రాలకి చెదలు పట్టి…వేదాలంటే వింతగా చూసి, విజ్ఞానం వదిలేసి…విదేశాలకి వలస పోయి,
మన సంస్కృతిని మూలన పెట్టి…పాశ్చాత్య వ్యామోహంలో పడి
కొట్టుమిట్టాడుతున్న మన దేశం, ఇదేమి భారతం!